భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ మండలం లోనీ, సోములగూడెం గ్రామం లో శ్రీ రామ మందిరం నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామస్థులు విరాళాలు సేకరిస్తున్నారని తెలుసుకుని బసవతారక కాలనీ నందు మీసేవ మరియు ఆధార్ సెంటర్ నడుపుతున్న నునావత్ ప్రసాద్ (మీసేవ ప్రసాద్) గారు స్వచ్ఛందంగా తన వంతు విరాళంగా 10,016/- విరాళంగా అందజేశారు.

ఈ కార్యకమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ త్వరలోనే రామ మందిరానికి భూమి పూజ చేసి పనులు మొదలు పెడతామని అన్నారు.. ఎవరైనా విరాళాలు అందజేయాలని అనుకునే వారు ఉంటే గ్రామస్తులని సంప్రదించవచ్చని వారు తెలిపారు.

ఈ క్రార్యక్రమం లో మీసేవ ప్రసాద్, రాజ్ కుమార్, రఘు కుమార్ , పూజల ప్రసాద్ , వెంకటేష్ , వాసు , వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.