రాబోయే 5-7 ఏళ్లలో ఆతిథ్య, పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(HAI) తెలిపింది.

దీని కోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దేశ అభివృద్ధిలో పర్యాటక రంగమూ కీలకమేనని HAI అధ్యక్షుడు పునీత్ అన్నారు. మొత్తం ఉపాధిలో 10 శాతం, జీడీపీలో 8 శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని చెప్పారు.