ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం

గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు.

ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఏసిపి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అలాగే ఏసిపి రమేష్ నేను సైతం అంటూ రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

అప్పన్న హస్త మిత్రబృందం సేవలు అభినందనీయమని వినూత్న సేవా కార్యక్రమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆపన్న ఆస్తమిత్ర బృందం సేవలు మరింత విస్తృతం చేయాలని ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాకు కూడా రక్తదానం చేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రక్త దానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆపన్న ఆస్త మిత్ర బృందం మరియు నాయకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.