శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్

భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ… బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా బుధవారం అక్కడికి వెళ్లిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ గండ్ర జ్యోతిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, నాయకులు గాజుల శ్రీనివాస్, పసరగొండ లక్ష్మయ్య, పసరగొండ స్వామి, ఇండిగ నర్సింగారావు, గాజుల శంకరయ్య, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.