మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్
బ్యాంక్ సేవలను వినియోగించుకోండి… – బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్
మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వై శోభ, ప్రభుదాస్, రీజనల్ మేనేజర్ వేమూరి సాయి కృష్ణ, సీనియర్ మేనేజర్ రాజు విచ్చేయుచున్నారని బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ తెలిపారు.
గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు బ్యాంకు సేవలనువినియోగించుకోవాలని, రైతులకు క్రాఫ్ లోన్స్ మరియు హౌసింగ్ లోన్స్ ఇస్తామని, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తామని, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు తరలి రావాలని, అందరూ ఆహ్వానితులేనని, బ్యాంక్ లో జీరో అకౌంట్ ఖాతాలు తీసుకోవచ్చన్నారు.