వర్గల్ 14 పిబ్రవరి, 2024

తెలంగాణ రాష్ట్రం లో రెండో భసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి పుట్టిన రోజు కావడం తో భక్తులతో ఆలయం కిట కిటలాడింది. శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవటానికి ఉదయాన్నే భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు.వసంత పంచమి కావడం తో ఆలయ సిబ్బంది ఉదయం 4 గంటలకు శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నంద సరస్వతి ఆధ్వర్యం లో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.

అనంతరం అమ్మవారికి అలంకరించి సరస్వతి మాతాగా భక్తులకు దర్శనం ఇచ్చారు.ఉదయం 6 గంటల నుండి అక్షర అభ్యసాలకు వచ్చిన భక్తుల కోసం ఒకే సారి సుమారు ఆరు వందల మంది భక్తులు అక్షర అభ్యాసాలు స్వీకరించే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.