భారతీయ జనతా పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా రాపాక రమేష్ నియమితులైనట్టు ఆయన తెలిపారు.

ఈ మేరకు ఈరోజు జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నన్ను, నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులుగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు.

నియామకం పట్ల హర్షం ప్రకటించిన బిజెపి నాయకులు

పాల్వంచ పట్టణ నూతన అధ్యక్షులుగా నియమితులైన రాపాక రమేష్ ను పాల్వంచ పట్టణ బిజెపి నాయకులు శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు,నాయకులు అలువాల సందీప్, గంధం నాగేంద్రప్రసాద్, క్రాంతి కుమార్, బట్టు శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.