LDM బద్ది కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి రేణుక చౌదరి గారి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసిన సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నందు కాంగ్రెస్ శ్రేణులు బానసంచ కాల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా బద్దికిషోర్ కుమార్ మాట్లాడుతూ…

నిజాయితీకి నిబద్ధతకు దక్కిన సముచిత గౌరవంగా భావిస్తున్నారు. శ్రీమతి రేణుకా చౌదరి గారు లాంటి సీనియర్ ఫైర్ బ్రాండ్ నాయకురాలిని రెండుసార్లు MP లోక్సభ గా, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక చేసుకోవడం ఆమెకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.

రాబోయే కాలంలో జిల్లా ప్రజలకు రాజ్యసభ సభ్యురాలుగా ఆమె మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా రేణుక చౌదరి గారిని రజసభ సభ్యురాలుగా ఎన్నిక చేసిన సందర్భంగా శ్రీమతి సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఇతర కేంద్ర రాష్ట్ర సీనియర్ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో LDM కోనేరు బద్ది కిషోర్ కుమార్ గారితో పాటు పాల్వంచ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హెచ్చు మధు, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ భూక్యా గిరి ప్రసాద్, మైనారిటీ నాయకులు ఎస్కే చాంద్బాషా సూర్య కిరణ్, బట్టు వీరు, బట్టు లక్ష్మణ్, ఎండ్. నసీబ్, సాంబశివరావు, పెట్టేటి నరేష్, చంద్రు, నజీర్, శంకర్, రాంబాబు, వీరన్న, రామారావు, సొందు పాషా, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.