ఆధార్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపచేయాలని DCMS చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

పాల్వంచ మండలం పరిధిలోని యానంబైల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను బుధవారం కొత్వాల ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మండలంలో ఎక్కువగా మారుమూల గిరిజన ప్రాంతాలున్నాయని, అక్కడి వారంతా సుమారు 20 కిలోమీటర్లు వరకు వ్యయప్రయాసలకు ఓర్చి పాల్వంచ పట్టణానికి రావలసి వస్తుందన్నారు.

సెంటర్ యానంబైల్ లో పెట్టడం వలన అందరికి సౌలభ్యంగా ఉంటుందని కొత్వాల అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్స్ PM విశ్వకర్మ శ్రీనివాసరెడ్డి, DM మధుసూదన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ బుడగం రామ్ మోహన్ రావు, యర్రంశెట్టి మధు, బుడగం మోహన్ రావు, బుడగం కిరణ్, వాసం మంగయ్య, కందుకూరి రాము, దారా చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.