సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు అవార్డుల పంట పండుతోంది.

ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్లో ఉత్తమ నటుడు, నటి, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ తదితర 8 విభాగాల్లో గెలుపొందింది. మూవీని నిర్మించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ విషయాన్ని ప్రకటించింది. నటుడు సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేయడం గమనార్హం.