ఫిలిప్పీన్స్లో పుట్టిన లుయ్సా యూ వయసు 79 ఏళ్లు. వయసు పెరిగే కొద్దీ వృద్ధులు ఇంటి పట్టున గడుపుతుంటారు. కానీ యూ అలా కాదు, యూఎన్లో సభ్యత్వం ఉన్న 193 దేశాలను చూడాలన్నది ఆమె యుక్తవయసు కల.

దాని కోసం గడచిన 30 ఏళ్లుగా ప్రపంచం తిరుగుతున్నారు. వయసు మీద పడిన తర్వాత కూడా 20కి పైగానే దేశాలు చుట్టేశారు. తాజాగా సెర్బియా టూర్తో తన కలను పూర్తి చేసుకున్నారు. Instagram లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటం విశేషం.