మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్ నుంచి పరిపాలన చేసే వారు కావాలో ప్రజలే తేల్చుకోవాలి. ఎన్నికల తర్వాత బాబు, లోకేశ్ హైదరాబాద్ పారిపోతారు’ అని ఆయన విమర్శించారు.