ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పిచ్చిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బాండ్లు జారీ చేసిన SBI మార్చి 6లోపు వివరాలను ECకి అందించాలి. వాటిని EC మార్చి 13లోపు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి.

ఒక పార్టీకి అందిన విరాళాల సమాచారం ఓటర్లకు తెలియాలి. తద్వారా సమర్థంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు’ అని పేర్కొంది. ఇప్పటివరకు SBI 28వేల బాండ్లను విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ. 16,518 కోట్లు.