విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఅవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి.

48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2021లో ఈ బైపాస్ పనులు మొదలవగా.. భూసేకరణలో సగం ఖర్చును రాష్ట్రం భరించింది. చెన్నై-కోల్కతా హైవేపై వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా బైపాస్ నిర్మించారు.