localnewsvibe

మతాన్ని,స్వార్థాన్ని, దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు – మార్క అనిల్ గౌడ్.

అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న – మార్క అనిల్ గౌడ్

అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా హిందువుగా గర్విస్తున్నాను.

నీతి, నిజాయితీ, ధర్మంతో ఉత్తమమైన పాలనతో జగత్తును పరిపాలించిన ఆ జగదాభిరాముడు అందరివాడు. అలాంటి రాముని పవిత్రమైన చరిత్రకు నేడు అపవిత్రమైన రాజకీయ భూతాన్ని ఆపాదించకండి.

మతాన్ని, దైవాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే భవిష్యత్తులో వినాశనం తప్పదు.

బిజెపి మతంతో, దైవంతో రాజకీయం చేయకుండా గత పది సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వ పాలనలో ప్రజా ఆమోదయోగ్యమైన సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారు ప్రజలకు వివరించండి. అంతేకానీ సర్వ మతాల నిలయమైన భారత దేశంలో మత రాజకీయాలు చేయకండి. హిందూ ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుని స్మరణ చేస్తు అన్య మతస్తులను, వారి సంప్రదాయాలను గౌరవించే హిందువుల మనోభావాలను మతం పేరుతో దెబ్బతీయవద్దు.మార్క అనిల్ గౌడ్ .