ఇరాక్ లో మృతి చెందిన వ్యక్తి కుటుంబ తల్లిదండ్రులకు బియ్యం అరకిలో తో పాటు నిత్యావసర సరుకులు ఆర్దికంగా అందించిన VBA-RPI-TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్

మంచిర్యాల జిల్లా :

(జన్నారం 24- ఫిబ్రవరి):

మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతి లో బతుకుదెరువు కోసం చాల చిన్న వయసు లో వలస వెళ్లి బ్రెయిన్ స్ట్రోక్ తో ఈరాక్ లో మృతి చెందిన కునారపు వెంకటేష్ కుటుంబానికి బియ్యం ఆర్ధిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ (MP)అభ్యర్థి మరియు వంచిత్ బహుజన్ ఆఘాడి (VBA) రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం TVYS రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ .గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎక్కడ మన పేద వాళ్ళు ఉన్న వాళ్లకు తన వంతుగా సహాయం చేస్తానని అన్నారు.గవ్వల శ్రీకాంత్ చేస్తున్న సహాయ సహకారాలను గ్రామ యువత వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అభినందించారు.

ఈ కార్యక్రమములో అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సామాజిక కార్యకర్త ఆత్రం అనసూయ, మాజీ సర్పంచ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గవ్వల లక్ష్మి ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తీగల శేఖర్, యూత్ సామాజిక కార్యకర్తలు, నాయకులు ,రాగి రవీందర్ ,కట్కం మల్లేష్ ,ముత్యంపెల్లి వెంకటచారి, కండ్లే దుబ్బయ్య ,సాకలి దేవయ్య, కునారాపు గంగన్న,గోలి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.