localnewsvibe

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ సోలో రిలీజ్ డేట్ ల సర్దుబాట్ల నేపద్యంలో మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. ఈ సినిమా పుల్వామా ఘటన తర్వాత భారత రక్షణ విభాగం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఎక్కించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. దాన్ని సినిమా యూనిట్ ధ్రువీకరించింది కూడా. అయితే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఈ సినిమాకి వేరే టైటిల్ పెట్టినట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ అనే సినిమా కూడా దాదాపు ఇదే నేపథ్యంలో వచ్చింది. దేశభక్తి సినిమా కావడంతో గణతంత్ర దినోత్సవ సందర్భంగా 25వ తేదీన రిలీజ్ చేశారు. సరిగ్గా నెల తిరగకుండానే ఇప్పుడు అదే కథాంశంతో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ రెండు సినిమాల మధ్య పాయింట్ ఒకటే, కానీ ఎమోషన్స్ డీల్ చేసిన విధానం వేరు. ఫైటర్ సినిమా చూసిన తర్వాత కూడా ఒక్క సీన్ మార్చే అవకాశం రాలేదంటే ఎంత భిన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చెబుతున్నారు. ఇక ఫిలిం వర్గాల సమాచారం మేరకు ఫైటర్ సినిమాకి 300 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకి మాత్రం కేవలం 40 కోట్ల బడ్జెట్ మాత్రమే అయింది. 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఫైటర్ సినిమా చూసి ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ చూసినవారు, 40 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఏనా ఇది? అని ఆశ్చర్యపోతున్నారు. కేవలం 40 కోట్ల రూపాయలతో ఇంత మంచి విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారంటే మేకింగ్ మీద దర్శకుడికి ఎంత గ్రిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే 300 కోట్ల రూపాయల ఫైటర్ సినిమాతో 40 కోట్ల రూపాయల ఆపరేషన్ వాలెంటైన్ పోటీ పడుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫైటర్ సినిమా చూసినవాళ్లు ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా చూడాల్సిందేనని భావిస్తున్నారు. సో కచ్చితంగా ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్చి ఒకటో తేదీన పూర్తిస్థాయిలో ఈ అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.