localnewsvibe

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలిచింది. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు ఉంది.

దీని నిర్మాణానికి రూ.979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ వంతెన ఓఖా ప్రాంతంతో ద్వారక ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. త్వరలోనే ఈ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో రాకపోకలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.