రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.

ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.