వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనుంది. పుస్తకాల తయారీలో 90 GSM(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది.

కవర్ పేజీ ప్రస్తుతం 250GSM ఉండగా, తాజాగా 200GSMకు తగ్గించారు. దీంతో ఒకటో తరగతి బుక్స్ బరువు 1.991 KGల నుంచి 1.40KGలకు, టెన్త్ క్లాస్ పుస్తకాల బరువు 5.373KGల నుంచి 4.193KGలకు తగ్గనుంది.