రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 31 వేల మంది తమ సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.

రష్యా ప్రచారం చేస్తున్నట్లుగా 3 లక్షల మంది చనిపోలేదని స్పష్టతనిచ్చారు. గాయపడిన, కనిపించకుండా పోయిన సైనికుల వివరాలను వెల్లడించబోనని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే రెండేళ్లు పూర్తైంది.