ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం.

మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి కుట్రపూరితంగా కేసీఆర్ ధరణిని ప్రవేశపెట్టారు. ధరణితో ఎన్ని వేల ఎకరాలను కబ్జా చేశారో? ఎంత కొల్లగొట్టారో? ప్రజలకు వివరిస్తాం’ అని తెలిపారు.