ట్రూకాలర్ యాప్ ఏఐ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికే ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.

దీని వల్ల ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ను నేరుగా యాప్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కాల్కు సంబంధించిన వివరాలను నోట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ట్రాన్సిక్రిప్షన్(అక్షరాల రూపంలో)ను ఇంగ్లిష్, హిందీలోనూ అందజేస్తుందని సంస్థ తెలిపింది.