వరుణ్ తేజ్, సాయి పల్లవి కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో వారి జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. అందుకు కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించారు. ‘మా కాంబోలో మరో సినిమా తీసుకొచ్చేందుకు కొంతమంది సంప్రదించారు. కానీ ఫిదాను మించిన కథ కాకపోతే కలిసి చేయొద్దని అనుకున్నాం’ అని వివరించారు. కాగా.. గద్దలకొండ గణేశ్ కు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని ఆయన తెలిపారు.