రూ.100కే గ్రాము బంగారం, రూ.10కే KG కందిపప్పు, రూ.3,500కే ఫ్రిజ్ అంటూ.. కేటుగాళ్లు మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది.

శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ‘ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్ట్’ పేరుతో రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి అమ్మారు.

వందల మంది రావడంతో రూ.24,000కు 10 గ్రాములు అని డబ్బులు దండుకున్నారు. ఇలా 300 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి పారిపోయారు. వారిపై కేసు నమోదైంది.