ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: పంచమి రా.02:56 వరకు తదుపరి షష్ఠి
వారం: గురువారం – బృహస్పతివాసరే
నక్షత్రం: చిత్ర ఉ.07:49 వరకు తదుపరి స్వాతి
యోగం: వృధ్ధి సా.05:56 వరకు తదుపరి ధృవ
కరణం: కౌలవ ప.02:13 వరకు
తదుపరి తైతుల రా.02:53 వరకు తదుపరి గరజ
వర్జ్యం: ప.01:49 – 03:32 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:30 – 11:18
మరియు ప.03:13 – 04:01
రాహు కాలం: ప.01:57 – 03:25
గుళిక కాలం: ఉ.09:31 – 11:00
యమ గండం: ఉ.06:34 – 08:03
అభిజిత్: 12:05 – 12:51
సూర్యోదయం: 06:34
సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: రా.10:15
చంద్రాస్తమయం: ఉ.09:16
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: దక్షిణం
ఔదుంబర పంచమి
గురుపంచమి యోగము
కొల్హాపూర్ శ్రీ కృష్ణ సరస్వతి మహారాజ్ జయన్తీ
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవారంభం
శ్రీల భక్తిసిద్దాంత సరస్వతి
ఠాకూర ఆవిర్భావ దినోత్సవం
కాశీమఠ శ్రీ విభుదేంద్రతీర్థ పుణ్యతిథి
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ అంకురార్పణ
ఉజ్జయిని శ్రీ మహాకాలేశ్వర నవరాత్రోత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకు పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
వృషభం
తలపెట్టిన కార్యాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.
మిధునం
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.
సింహం
చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోకండి. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వలన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి పఠించాలి.
కన్య
చేపట్టే పనిలో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.
తుల
దైవ బలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలున్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్నిస్తుంది.
వృశ్చికం
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం చేయడం మంచిది.
ధనుస్సు
ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపుతప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులు పోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మి దేవి ఆరాధన శ్రేయోదాయకం.
మకరం
అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. స్తిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం
ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. సుబ్రహ్మణ్య ఆరాధనా మేలు చేస్తుంది.
మీనం
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభాన్నిస్తుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)