ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ – బహుళ
తిథి: షష్టి రా.తె.03:37 వరకు
తదుపరి సప్తమి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: స్వాతి ఉ.09:31 వరకు
తదుపరి విశాఖ
యోగం: ధృవ సా.06:14 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: గరజ ప.02:45 వరకు
తదుపరి వణిజ రా.తె.03:37 వరకు
తదుపరి భధ్ర
వర్జ్యం: ప.03:26 – 05:08 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:55 – 09:43
మరియు ప.12:52 – 01:39
రాహు కాలం: ఉ.10:59 – 12:28
గుళిక కాలం: ఉ.08:02 – 09:31
యమ గండం: ప.03:25 – 04:54
అభిజిత్: 12:05 – 12:51
సూర్యోదయం: 06:34
సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: రా.11:08
చంద్రాస్తమయం: ఉ.09:52
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: పశ్చిమం
శ్రీ యశోదామాత జయన్తీ
శ్రీ సుప్రజ్ఞేంద్రతీర్థ పుణ్యతిథి
శ్రీ రాళ్ళబండి నృసింహశాస్త్రి జయన్తీ
సంత్ దాసోపంత్ పుణ్యతిథి
దత్త మహారాజ్ కవీశ్వర్ జయన్తి
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవారంభం
నేటి రాశి ఫలాలు
మేషం
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
వృషభం
మనఃసౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
మిధునం
మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితా దేవిని స్తుతి చేయాలి.
కర్కాటకం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హ్రుదయం చదవడం ఉత్తమం.
సింహం
కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
కన్య
చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.
తుల
గ్రహబలం అనుకూలిస్తోంది. అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
వృశ్చికం
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. సగ్గోష్ఠి, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి విష్ణు ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
మీ మీ రంగాల్లో అనుకున్నఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారాస్తవం పఠించాలి.
మకరం
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
కుంభం
మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
మీనం
ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరి చేరనీయకండి. శివనామాన్ని జపించడం ఉత్తమం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)