ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 65.92లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.1958.52 కోట్లు విడుదల చేసింది.
ఐదు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్న వారి కోసం ఆర్బిఐఎస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.