ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ ఫీచర్ గురించి చాలామందికి తెలుసు. కేవలం ఆడియో మాత్రమే వాటిలో వినిపిస్తుంది.

ఈ స్పేసెస్లో ఒక గ్రూప్ గా ఏర్పడి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో ఇక నుంచి వీడియోలో మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే కొందరు iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్, వెబ్ యూజర్లు మాత్రం మరికొంత కాలం ఎదురు చూడాల్సి ఉంది.