రాష్ట్ర అటవీశాఖలో 2,108 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 6,860 పోస్టులకు 4,752 మంది సిబ్బందే ఉన్నట్లు తెలిపారు.
ఉన్నవారిలో కొందరు ఇతర శాఖలకు డిప్యుటేషన్ పై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని CM రేవంత్ కు వివరించారు. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని, అటవీశాఖ నుంచి డిప్యుటేషన్ పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అధికారులను CM ఆదేశించారు.