సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది.

వచ్చే నెల 9న జెమిని టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీలో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.