కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ CM కేసీఆర్ అన్నారు. జగిత్యాల రోడ్ షో లో ఆయన మాట్లాడారు.

‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదని దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలోని కాల్వలను నీళ్లతో నింపితే.. ఇప్పుడు ఎండబెడుతోంది. రైతు బంధుకు 5 ఎకరాలకు కాదు.. 25 ఎకరాలకు సీలింగ్ పెట్టాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.