పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఖైబర్ పుంఖ్వా ప్రావిన్స్లోని స్వాత్ లోయలో 13 ఏళ్ల బాలికను 70 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు.

దీంతో బాలిక తండ్రి, ఆ వృద్ధుడితోపాటు వివాహాన్ని జరిపించిన అధికారి, సాక్షులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ గర్లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ దేశంలో వివాహ వయస్సు ఆడపిల్లలకు 16, అబ్బాయిలకు 18 ఏళ్లుగా ఉంది.