లక్నోతో నిన్న జరిగిన మ్యాచులో కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నారు. స్టార్క్ బౌలింగ్లో అర్షిన్ కులకర్ణి గాల్లోకి ఆడిన బంతిని రమణ్ దీప్ చాలా దూరం పరిగెత్తి రెండు చేతులలో పట్టుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఈ సీజన్లోనే బెస్ట్ క్యాచ్ అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచులో LSGపై KKR 98 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.