మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) సినిమా ఓటీటీలోకి రానుంది.

ఈ నెల 10 లేదా 26వ తేదీ నుంచి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది.