దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు దేశానికి రానున్నాయి.
ఇప్పటికే ఈ రెండూ కలిసి తీసుకొచ్చిన ఎక్స్-440 మోటారైకిల్ కు మంచి ఆదరణ దక్కడంతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని ఇరు కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరిన్ని ఏళ్లు కొనసాగించడంతో పాటు ఇతర దేశాలకూ ఇక్కడ తయారుచేసిన మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయాలని భావిస్తున్నాయి.