localnewsvibe

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: సప్తమి రా.09:09 వరకు
తదుపరి అష్టమి

వారం: గురువారం – బృహస్పతి
వాసరే

నక్షత్రం: పూర్వఫల్గుణి రా.తె.05:13 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: వజ్ర సా.06:02 వరకు
తదుపరి సిద్ధి

కరణం: గరజ ఉ‌.08:17 వరకు
తదుపరి వణిజ రా.09:09 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: ఉ‌.11:35 – 01:20 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:04 – 10:57
మరియు ప‌.03:20 – 04:13

రాహు కాలం: ప‌.01:54 – 03:34

గుళిక కాలం: ఉ‌.08:58 – 10:37

యమ గండం: ఉ‌.05:41 – 07:20

అభిజిత్: 11:50 – 12:42

సూర్యోదయం: 05:41

సూర్యాస్తమయం: 06:51

చంద్రోదయం: ఉ‌.11:34

చంద్రాస్తమయం: రా.12:14

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: దక్షిణం

ద్వాదశసప్తమి‌

వరుణపూజ‌

కోలాబాస్వామి జయన్తి –
పుణ్యతిథి

కంచి జగద్గురు శ్రీ సచ్చిత్సుఖేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి‌

శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి
పుణ్యతిథి



నేటి రాశి ఫలాలు



మేషం

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

వృషభం

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవనామాన్ని జపించడం ఉత్తమం.

మిధునం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

కర్కాటకం

అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

సింహం

జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవప్రార్ధన శ్రేయోదాయకం.

కన్య

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. శ్రీలలితా దేవి స్తుతి చేయాలి.

తుల

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి విష్ణు ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ధనుస్సు

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్ర నామ పారాయణ చేయాలి.

మకరం

ప్రారంభించబోయే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

కుంభం

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవాలి.

మీనం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)