ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: జ్యేష్ఠ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: అష్టమి రా.11:09 వరకు
తదుపరి నవమి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి పూర్తి
యోగం: సిద్ధి రా.07:05 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: భధ్ర ఉ.10:09 వరకు
తదుపరి బవ రా.11:09 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: ప.01:14 – 03:01 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:19 – 09:12
మరియు ప.12:42 – 01:35
రాహు కాలం: ఉ.10:37 – 12:16
గుళిక కాలం: ఉ.07:20 – 08:59
యమ గండం: ప.03:33 – 05:12
అభిజిత్: 11:50 – 12:42
సూర్యోదయం: 05:41
సూర్యాస్తమయం: 06:51
చంద్రోదయం: ప.12:21
చంద్రాస్తమయం: రా.12:14
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: సింహం
దిశ శూల: పశ్చిమం
నక్షత్ర శూల: ఉత్తరం
దుర్గాష్టమి
ధూమవతి జయన్తీ
జ్యేష్ఠాష్టమి
శుక్లాష్టమి
శుక్లదేవి పూజ
దగ్ధయోగము
కాశ్మీర్ క్షీర్‌భవానీ మేళా
శ్రీ ధారా రామనాథశాస్త్రి
జయన్తీ
కంచి జగద్గురు శ్రీ ప్రజ్ఞాఘనేన్ద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి
పరమహంస తుకామయ
పుణ్యతిథి
వరదరాజపురం శ్రీ వరదరాజ
స్వామి బ్రహ్మోత్సవారంభం
కంచి జగద్గురు శ్రీ ఉజ్వలశంకరైంద్ర
సరస్వతి స్వామి పుణ్యతిథి
కందాదేవి స్వర్ణమూర్తీశ్వరర్
పెరియనాయక రథోత్సవం
నేటి రాశి ఫలాలు
మేషం
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు విషయాలపైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృషభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.
మిధునం
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు . ఇష్టదైవధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
సింహం
కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
కన్య
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
తుల
మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూలమైన లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణతో అంతా మంచి జరుగుతంది.
ధనుస్సు
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మకరం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
కుంభం
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. శని ధ్యానం చేయాలి.
మీనం
శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)