ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నెల 18న మంత్రి మండలి తొలి సమావేశం జరపాలని, 19వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.