ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: ఏకాదశి రా.తె.04:49 వరకు
తదుపరి ద్వాదశి

వారం: సోమవారం – ఇందువాసరే

నక్షత్రం: చిత్ర ప‌.12:51 వరకు
తదుపరి స్వాతి

యోగం: పరిఘ రా.09:33 వరకు
తదుపరి శివ

కరణం: వణిజ ప‌.03:58 వరకు
తదుపరి భధ్ర రా.తె.04:49 వరకు
తదుపరి బవ

వర్జ్యం: రా.06:58 – 08:42 వరకు

దుర్ముహూర్తం: ప‌.12:43 – 01:36
మరియు ప‌.3:21 – 04:14

రాహు కాలం: ఉ‌.07:20 – 08:59

గుళిక కాలం: ప‌.01:55 – 03:34

యమ గండం: ఉ‌.10:38 – 12:17

అభిజిత్: 11:51 – 12:43

సూర్యోదయం: 05:42

సూర్యాస్తమయం: 06:52

చంద్రోదయం: ప‌.02:43

చంద్రాస్తమయం: రా.01:50

సూర్య సంచార రాశి: మిథునం

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: తూర్పు

నిర్జల ఏకాదశి

గాయత్రి జయన్తీ
(మతాంతరం)

దగ్ధయోగము

త్రివిక్రమ ఏకాదశి

రుక్మిణి కళ్యాణం

భీమఏకాదశి

పాండవ ఏకాదశి

గోపాల‌ గణేష్ అగార్కర్‌
పుణ్యతిథి‌

గురు అచల్‌దాస్‌ పుణ్యతిథి

శ్రీ గణపతి సచ్చిదానంద
సరస్వతి స్వామి జయన్తీ

శ్రీ ముఖలింగేశ్వర‌
కల్యాణోత్సవారంభం

ఝాన్సీరాణి లక్ష్మీబాయి
స్మృతి దినం

శ్రీ వంఛీనాథర్‌ అయ్యర్‌
స్మృతి దినం


నేటి రాశి ఫలాలు


మేషం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

వృషభం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

మిధునం

గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

సింహం

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

కన్య

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ధనస్సు

ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం

వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం

అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)