ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగం


విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: చతుర్దశి ఉ‌.06:56 వరకు
తదుపరి పూర్ణిమ

వారం: శుక్రవారం – భృగువాసరే

నక్షత్రం: జ్యేష్ఠ 18:19:32 వరకు
తదుపరి మూల

యోగం: శుభ సా.06:44 వరకు
తదుపరి శుక్ల

కరణం: వణిజ ఉ‌.06:56 వరకు
తదుపరి భధ్ర‌ రా.06:52 వరకు
తదుపరి బవ

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ‌.08:20 – 09:13
మరియు ఉ‌.12:44 – 01:37

రాహు కాలం: ఉ‌.10:39 – 12:18

గుళిక కాలం: ఉ‌.07:21 – 09:00

యమ గండం: ప‌.03:35 – 05:14

అభిజిత్: 11:51 – 12:43

సూర్యోదయం: 05:42

సూర్యాస్తమయం: 06:53

చంద్రోదయం: సా.06:28

చంద్రాస్తమయం: రా.తె.04:39

సూర్య సంచార రాశి: మిథునం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

దిశ శూల: పశ్చిమం

నక్షత్ర శూల: తూర్పు

చంపక చతుర్దశి

శ్రీపాదరాజర‌ పుణ్యతిథి‌

భార్గవరాకా‌ వ్రతం ( శ్రీ లక్ష్మి పూజ )

శ్రీ జ్ఞానేశ్వర్‌మావులి‌
చక్రవాడేకర్‌ పుణ్యతిథి

వటసావిత్రి వ్రతం

మహాజ్యేష్ఠి‌

భౌచ్యక‌ మన్వాది‌

సరయూనది‌ జయన్తీ

శ్రీ విద్యాధరస్వామి‌
వర్ధంతోత్సవం

తిరుమల శ్రీ వేంకటేశ్వర
స్వామి జ్యేష్ఠాభిషేక సమాప్తి

ఏరువాక పూర్ణిమ

పూర్ణిమోపవాసం‌

విశ్వ యోగ‌ దినోత్సవం

అరుణాచల నాయకర్‌ గిరివాల‌ ఉత్సవం

శ్రీరంగం రంగనాథ పెరుమాళ్ జ్యేష్ఠాభీషేక‌ ఉత్సవం

శ్రీ కేశవ్ బలీరాం హెడ్గేవార్
స్మృతి దినం


నేటి రాశి ఫలాలు


మేషం

లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

వృషభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

మిధునం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదడం మంచిది.

కర్కాటకం

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది.

కన్య

కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం

చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం మంచిది.

మకరం

ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనంతో శుభఫలితాలు పొందుతారు.

కుంభం

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చకండి. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం.

మీనం

పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)