వేమన పద్యం :

ఏకాంత మిరవు గన్గొని
లోకాంతము జేర బోయి లోబయలగునా ?
పాకంబు బూని మించిన
నీ కింపగు చిత్పరంబు నెలవగు వేమా !

తాత్పర్యము :

మర్మజ్ఞానం , సూక్ష్మాంశ పరిశీలన చేయగల సమర్థుడు చిదానంద స్వరూపుడగును.


వేమన పద్యం :

ఏకాంత మిరవు గన్గొను
శ్రీకాంతుని బ్రహ్మమయుని జిన్మయు బరునిన్
సాకార రూపుసాక్షి నిజాకారమె
పరమపది యారయ వేమా !

తాత్పర్యము :

ఏది పరమపదమన్నచో విష్ణుమూర్తి ధ్యానమే అన్నిటికి మూలము.


వేమన పద్యం :

‘ ఏకోబ్రహ్మ ‘ మనంగా
వైకల్పితమైన జగము వారల కెల్లన్
సాకారత్వము లుడిగిన
శోకము మోహంబు లేదు శుభమగు వేమా !

తాత్పర్యము :

‘ ఏకోబ్రహ్మ ‘ పరబ్రహ్మమొక్కటే అని తలచిన వానికి ఏ దిగులు ఉండదు.
ఏ మోహము ఉండదు.
అన్నింటా శుభమే కలుగును.