localnewsvibe

మారుతున్న జీవన శైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ ఒకటి. దీంతో రొమ్ము భాగంలో ఏ మాత్రం గట్టిగా తగిలినా మహిళలు హడలెత్తిపోతుంటారు. చాలా మంది రొమ్ము క్యాన్సర్ మహిళలకు మాత్రమే వస్తుందని అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు.

ఎందుకంటే రొమ్ము క్యాన్సర్‌ మహిళలకే కాదు పురుషులకు కూడా వస్తుంది. పురుషులలో రొమ్ము కణజాలం తక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అది కూడా ప్రమాదకరమే.ప్రపంచంలోని మొత్తం రొమ్ము క్యాన్సర్ కేసులలో 1 శాతం పురుషుల్లో కనిపిస్తుంది. అయితే అది భయంకరంగా ఉంటుంది. అందుకే మొదటి నుంచీ జాగ్రత్త తీసుకోవడం అవసరం.

క్యాన్సర్‌ లక్షణాల గురించి తెలుసుకుంటే దీనిని త్వరగా గుర్తించవచ్చు. రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు, ఎరుపు రంగులో నిపుల్స్‌ ఉండటం.. వంటి లక్షణాలు ఉంటే ఈ ప్రాణాంత వ్యాధి భారీన పడవచ్చు.

చనుమొన నుంచి చీము వంటి ద్రవం బయటకు రావడం, చనుమొన లోపలికి చొచ్చుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రారంభంలోనే గుర్తిస్తే వ్యాధి ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే BRCA టెస్ట్ చేయించుకోవాలి. ఇది జన్యు పరీక్ష. పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా ఉంటే జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఆ ఆ వ్యక్తికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినంత వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అర్ధం కాదు. సరైన చికిత్స తీసుకుంటే సకాలంలో కోలుకోవచ్చు.