రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా రూ.వెయ్యి కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది.

రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే సాయం చేస్తున్నామని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికా స్టాక్పైల్స్ నుంచి ఈ సాయాన్ని అందజేస్తామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.