తెలంగాణను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. చాలా జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు.

హైదరాబాద్ లో అయితే చాలా దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఇంటి పరిసరాల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.