రాజ్కుమార్రావు, శ్రద్ధాకపూర్ జంటగా అమరొకౌశిక్ తెరకెక్కించిన చిత్రం ‘స్త్రీ 2’. ఆగస్టు 15న విడుదలకానున్న ఈసినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు నమోదు చేసింది. బాలీవుడ్లో ‘ఫైటర్’, ‘కల్కి’ల అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లను దాటేసింది.

ఇప్పటివరకు రూ. 20 కోట్లకు పైగా వచ్చినట్లు చిత్రబృందం పేర్కొంది. బాలీవుడ్లో ఆగస్టు 15న విడుదల కానున్న చిత్రాలన్నిటి అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ‘స్త్రీ 2’కే ఎక్కువ రావడం విశేషం.