ఉగాండా రాజధాని కంపాలలో విస్తారమైన పల్లపు ప్రాంతం కుంగిపోయి కనీసం 21 మంది మృతిచెందగా, మరో 14 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది.
పట్టణంలో డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ ప్రాంతం శుక్రవారం రాత్రి కుంగిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలకు వర్షాలు ఆటంకంగా ఉన్నప్పటికీ, ఆదివారం నాటికి మృతదేహాలను వెలికి తీయగలిగారు.