బాలింతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య బాలింతలకు అందజేసిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రంలో డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల పనితీరు దేశంలోనే ఉత్తమంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.