వైరల్ వ్యాధి మంకీపాక్స్ (ఎంపాక్స్)ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా WHO ప్రకటించింది.

గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి WHO ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. కాంగోలో ఈ వైరల్ వ్యాధి విజృంభించడంతో పాటు ఇతర చుట్టుపక్కల దేశాలకు ఇది వ్యాపించింది. ఆయా దేశాల్లో దాదాపు 500 మందికిపైగా ఈ వ్యాధి వల్ల చనిపోయారని సమాచారం.