ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీధన్యాశ్రీధరాయనమః
కలియుగం: 5126
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: శ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: ఏకాదశి ఉ.06:09 వరకు
తదుపరి ద్వాదశి రా.తె.05:33 వరకు
తదుపరి త్రయోదశి
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: మూల ఉ.10:43 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: విష్కుంభ ప.01:10 వరకు
తదుపరి ప్రీతి
కరణం: భధ్ర ఉ.06:23 వరకు
తదుపరి బవ సా.05:55 వరకు
తదుపరి బాలవ రా.తె.05:33 వరకు
తదుపరి కౌలువ
వర్జ్యం: ఉ.09:05 – 10:43 వరకు
మరియు రా.08:18 – 09:53 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:31 – 09:22
మరియు ప.12:45 – 01:36
రాహు కాలం: ఉ.10:44 – 12:20
గుళిక కాలం: ఉ.07:34 – 09:09
యమ గండం: ప.03:30 – 05:05
అభిజిత్: 11:55 – 12:45
సూర్యోదయం: 05:59
సూర్యాస్తమయం: 06:41
చంద్రోదయం: ప.03:56
చంద్రాస్తమయం: రా.02:04
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: పశ్చిమం
పుత్రదా ఏకాదశి
పూరి – మధుర –
ఝులన్ యాత్ర
ఆడి – శ్రావణ శుక్రవార
మహాలక్ష్మి పూజ
పవిత్ర ఏకాదశి
వరలక్ష్మీ వ్రతం
ధధివ్రతారంభం
శ్రావణ శుక్ల ద్వాదశి మూల
యోగం
( స్నాన, ఉపవాస, దాన విశేషఫలం)
సంత్ విశోభా ఖేచర్
పుణ్యతిథి
జర – జీవంతికా పూజ
సేవల్కర్ మహారాజ్
పుణ్యతిథి
పవిత్ర ద్వాదశి
విష్ణు పవిత్రారోపణం
దామోదర ద్వాదశి
శ్రీమహావిష్ణువు ప్రతిమ –
సాలిగ్రామ దానం
శాకదానం
శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
జయన్తీ
ఉరుకుంద ఈరన్న
స్వామి పల్లకోత్సవం
శాకవ్రత సమర్పణము
వాసుదేవ నమస్తుభ్యం
ఆషాఢ మత్కృతేన చ |
శాకవ్రతేన దేవేశ
ప్రసన్నో భవ మాధవ ॥
దధివ్రతసంకల్పము
సంకర్షణారవిందాక్ష
కరిష్యేహం దధివ్రతం
ద్వితీయే మాసి దేవేశ
నిర్విఘ్నం కురు మే ప్రభో ॥
పవిత్రసమర్పణము
దేవ దేవ నమస్తుభ్యం
పవిత్రం పూతముత్తమం |
గృహీత్వా వార్షికీం పూజాం
భగవన్ పరిపూరయ ||
పవిత్రం మే కురుష్వద్య
యన్మయా దుష్కృతం కృతం |
శుద్ధో భవామ్యహం దేవ
త్వత్ప్రసాదాత్ సురేశ్వర ॥
రాశి ఫలాలు
మేషం
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృషభం
వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు
మిధునం
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కర్కాటకం
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.
సింహం
సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కన్య
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
తుల
బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృశ్చికం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
ధనస్సు
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.
మకరం
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.
కుంభం
ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
మీనం
సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)